వ‌ర్క్ ఫ్రం హోం చేస్తోన్న ఎమ్మెల్యే రోజా

గురువారం, 6 మే 2021 (16:52 IST)
కొన్ని రోజుల క్రితం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న రోజా డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. అప్పట్నుంచి వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశం అవుతున్నారు.
 
నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించ‌డంతో ఆమె ఇంటి నుంచే ప‌నిచేస్తున్నారు. కొంద‌రు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో తాను వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడాన‌ని తెలుపుతూ రోజా వీడియోను పోస్ట్ చేశారు.

రెండు రోజుల క్రితం కూడా ఆమె క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌తో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడి క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ప్ర‌జ‌ల‌కు అందించాల్సిన సాయంపై సూచ‌న‌లు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు