సెల్‌ఫోన్, ల్యాప్ టాప్ పక్కనబెట్టండి.. అప్పుడే ప్లేటులో భోజనం..

గురువారం, 18 మే 2023 (12:02 IST)
Food
సెల్ ఫోన్ మనిషికి ఆరో వేలుగా మారింది. భోజనం చేసేటప్పుడు కూడా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా సెల్ ఫోన్లలో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మునిగితేలుతున్నారు. దీంతో కుటుంబ సమేతంగా భోజనం చేసినా కిచెన్‌లో, డైనింగ్ టేబుల్‌లో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోటు దక్కించుకుంటున్నాయి. 
 
ఈ సందర్భంలో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేకుండా కుటుంబ సభ్యులు ప్రశాంతంగా భోజనం చేసేందుకు ఓ తల్లి అవలంబించిన కొత్త 'టెక్నిక్' ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. డిన్నర్ రెడీ చేసిన తర్వాత అమ్మ డైనింగ్ టేబుల్ మీద పెట్టి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తుంది. 
 
ఒక్కొక్కరుగా వస్తుంటే సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఆమెకు అందజేస్తేనే ప్లేట్‌లకు ఆహారం పెడుతోంది. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని ప్రశాంతంగా భోజనం చేసే సన్నివేశాలున్నాయి. 
 
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె టెక్నిక్‌ని మెచ్చుకుంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోకు 1.5 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా నెట్టింట వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు