అది బీజేపీ - వైసీపీల కుట్ర - నారా లోకేష్‌

గురువారం, 12 ఏప్రియల్ 2018 (09:08 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని.. హామీల‌న్నింటినీ నెర‌వేరుస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం మొదట చెప్పిందని, కానీ మాట తప్పిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఆయన బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఏపీని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు బీజేపీ, వైసీపీలు కలిసి కుట్ర రాజకీయాలు మొదలు పెట్టాయని ఆరోపించారు.
 
వైసీపీ ఎంపీలు రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న‌ట్టు న‌టిస్తున్నార‌ని... పార్లమెంటులో పిల్లిలా ఉంటారని, వారు కేసుల మాఫీ కోసమే అలా ఉంటున్నారని, ఏమీ పోరాడటం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని.. ఆవేశంగా మాట్లాడుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చేసిన వారు అసూయపడేలా రాజధానిని అభివృద్ధి చేసుకుందాం అంటూ ఆయన పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు