మోడీ వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. పోప్‌ను ప్రధాని మోదీ కలిసినప్పుడు, పోప్ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో గాఢమైన సాన్నిహిత్యం, పరస్పర గౌరవం, ప్రేమ తొణికిసలాడింది.
తొలుత పోప్‌ను ఏకాంతంగా కలిసిన మోదీ, ఆ తర్వాత ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సాంప్రదాయకంగా, పోప్‌తో సమావేశానికి ముందుగా నిర్ణయించిన ఎజెండా లేదు.
ప్రపంచాన్ని మెరుగుపరిచే వాతావరణ మార్పు, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై చర్చించారు. కోవిడ్ మహమ్మారి, ఆరోగ్యం, శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు కలిసి పనిచేసే విధానంపై కూడా చర్చలు జరిగాయి.