ఇటీవల నైజీరియాలోని పాఠశాలలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. డబ్బుకోసం దుండగులు స్కూళ్లపై వరుస దాడులకు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. గత ఫిబ్రవరిలో జాంఫారా రాష్ట్రంలోని జాంగెబేకు చెందిన ఓ బోర్డింగ్ స్కూలు నుంచి 300 మంది బాలికలను కిడ్నాప్ చేశారు.
తర్వాత వారిని వదిలేశారు. ఏప్రిల్ 20న అపహరించిన 14 మంది యూనివర్సిటీ విద్యార్థులను శనివారం విడిచిపెట్టారు. నైజీరియాలో గతేడాది డిసెంబర్ నుంచి కనీసం ఆరుసార్లు ఇలాంటి కిడ్నాప్‌లు జరిగాయని, 700 మందికి పైగా విద్యార్థులు అపహరణకు గురయ్యారు.