కేరళ రాష్ట్రాన్ని వణికించిన నిపా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు లినీ అనే నర్సు ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్తగా గర్వపడుతున్నట్టు సజీష్ వ్యాఖ్యానించారు. తన భార్యతో మాట్లాడిన చివరి మాటలను ఆయన గుర్తుచేసుకుంటున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళుతున్న సమయంలో లినీ చివరిసారిగా ఫోన్ చేసిందని.. జ్వరం ఇంకా తగ్గలేదని చెప్పినట్లు సజీష్ తెలిపాడు.
అయితే, లినీ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిందని.. ఆమె అంకిత భావాన్ని అందరూ అభినందిస్తుంటే గర్వంగా ఉందని సజీష్ చెప్పాడు. లినీ ఎప్పుడూ వృత్తి ద్రోహానికి పాల్పడలేదని నూటికి నూరు పాళ్లు నిజాయితీగా పనిచేసేదని తెలిపాడు. ఆమె భర్తగా గర్వపడుతున్నట్టు సజీష్ వ్యాఖ్యానించాడు. కాగా, లినీ ఉద్యోగాన్ని సజీష్‌కు కేరళ ప్రభుత్వం ఇవ్వనుంది.
కాగా, నపా వైరస్ బారిన పడి కేరళలో ఇప్పటివరకు 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో లినీ ఒకరు. అలాగే, మరికొందరు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. మరోవైపు, ఈ వైరస్ కర్ణాటక రాష్ట్రానికి కూడా వ్యాపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ఇద్దరిని ఆ రాష్ట్ర వైద్యులు గుర్తించారు.