ముద్దాయిలైన పవన్ కుమార్, అక్షయ్ కుమార్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలను ఉరితీసేందుకు ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితి బాగుందని తీహార్ జైలు వైద్యాధికారులు నిర్ధారించారు.
ఉరితీసేందుకు ముందు జైలు సూపరింటెండెంట్, వైద్యాధికారి, జిల్లా కలెక్టర్ దోషులు ఉన్న సెల్‌లోకి వెళ్లి దోషులను కలిశారు. చివరి కోరిక, ఇతర విషయాలన్ని పత్రాల్లో రాయించుకుని దోషుల సంతకాలు తీసుకున్నారు. జైలు నెంబర్ మూడులో ఉన్న ఉరికంబం వద్దకు దోషులను తరలించారు.