వేసవి కాలంలో మామిడి పండ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. బంగినపల్లి మామిడి పండ్లకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. తాజాగా ఈ సీజన్‌లో నూర్జహాన్ మామిడి పండ్లకు మంచి క్రేజ్ దక్కింది. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండించే ఈ రకం మామిడి పండ్లకు ఒక్కొక్కటి రూ.500 నుంచి రూ.1,000 పలుకుతుండటం విశేషం. జనవరి, ఫిబ్రవరిలో ఈ చెట్లు పూతకు పూస్తాయి. జూన్ ప్రారంభంలో పండ్లు చేతికొస్తాయి. ఈ మామిడి కాయలు ఒక్కొక్కటి అడుగు మేర పొడువు ఉంటాయి.