శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోగానే ప్రశాంతం: పవన్ కళ్యాణ్

శుక్రవారం, 22 జనవరి 2021 (16:20 IST)
తిరుమల శ్రీవారిని జనసేనాని పవన్ కళ్యాణ్  దర్సించుకున్నారు. సాంప్రదాయ వస్త్ర ధారణలో స్వామివారి సేవలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేనపార్టీకి చెందిన ముఖ్య నేతలతో కలిసి స్వామి వారిని దర్సించుకున్నారు. ముందుగా వైకుంఠం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ సాధారణ భక్తుడిలాగా స్వామిసేవలో పాల్గొన్నారు.
 
ఎలాంటి హడావిడి లేకుండా జనసేనాని ఆలయంలోకి వెళ్ళారు. టిటిడి అధికారులు పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. ఆలయ దర్సనానంతరం వెలుపల మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎప్పుడో శ్రీవారిని దర్సించుకోవాలనుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.
 
అయితే కరోనా కారణంగా స్వామివారిని దర్సించుకోలేకపోయానని చెప్పారు. స్వామివారిని దర్సించుకున్న తరువాత మనస్సుకు ప్రశాంతంగా ఉందన్నారు. తిరుమలలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడనని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 
 
అయితే ఒక్కసారిగా పవన్ అభిమానులు ఆలయం ముందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సిఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయం వద్ద గట్టిగా అరవొద్దని జనసేనాని అభిమానులకు నచ్చచెబుతూ మెల్లగా అక్కడి నుంచి కారు ఎక్కి వెళ్ళిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు