165 రోజులు విదేశాల్లోనే.. ప్రధాని మోడీ ఫారిన్ టూర్ల ఖర్చు రూ.355 కోట్లు

శుక్రవారం, 29 జూన్ 2018 (16:53 IST)
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కువగా విదేశీ పర్యటనలు జరుపుతున్నారు. ముఖ్యంగా, దేశంలోని రాష్ట్రాల్లో జరుపుతున్న పర్యటనల కంటే విదేశీ పర్యటనలకే ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల సమయాల్లో మాత్రం ప్రధాని మోడీ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
 
ఇదిలావుంటే ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు సంబంధించి బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన దగ్గర్నుంచి ఇప్పటివరకూ మొత్తం 41 సార్లు పర్యటించారు. ఈ పర్యటనలకు అయిన మొత్తం ఖర్చు అక్షరాలా రూ.355 కోట్లు. పర్యటనల్లో భాగంగా ఆయన 165 రోజులు విదేశాల్లో గడిపారు. 
 
ఇదిలావుంటే, ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించి పీఎంవో కార్యాలయం కూడా అధికారిక లెక్కలను అందుబాటులో ఉంచింది. ఏ దేశ పర్యటనకు ఎంతెంత ఖర్చయింది.. ఎన్ని రోజుల పాటు పర్యటన సాగింది... ఆ టూర్‌‌లో ఏఏ దేశాల్లో ప్రధాని పర్యటించారనే వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని దేశాల పర్యటనలకు సంబంధించిన బిల్లులు ఇంకా రాలేదన్న విషయం కూడా పీఎంవో ఆ వెబ్‌సైట్లో పొందుపరచడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు