ఉత్తరాఖండ్‌: నీటిలో కొట్టుకుపోయిన ఏటీఎం.. రూ. 24లక్షలు స్వాహా

శుక్రవారం, 12 ఆగస్టు 2022 (15:19 IST)
ATM
ఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా ఓ ఏటీఎం నీటిలో కొట్టుకుపోయింది. అది కొట్టుకుపోవడానికి ముందు బ్యాంకు అధికారులు అందులో రూ. 24లక్షలు జమ చేశారు. ఉత్తరాఖండ్‌లో జరిగిందీ ఘటన. 
 
ఉత్తర కాశీ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో కుమోలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
 
పురోలా పట్టణంలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నదిలో కొట్టుకుపోయాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. 
 
అంతకుముందే అందులో రూ. 24 లక్షలు నగదు ఉంచినట్టు చెప్పారు. ఏటీఎం నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు