జార్ఖండ్ సీఎం డ్యాన్స్.. నెట్టింట వైరల్

శనివారం, 9 మార్చి 2019 (13:01 IST)
జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ కుమారుడు లలిత్‌దాస్‌ వార్తల్లో నిలిచారు. శుక్రవారం రాయ్‌పూర్‌కు చెందిన పూర్ణిమతో రఘువర్‌దాస్ కుమారుడు లలిత్‌దాస్‌కు వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో భాగంగా పల్లకీలో వరుణ్ణి మేళతాళాల మధ్య ఊరేగించారు. వివాహం ఛత్తీస్‌గఢ్ సంప్రదాయ రీతిలో జరిగింది. 
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ ఆనందం పట్టలేక బంధువులతో పాటు నృత్యం చేశారు. సంప్రదాయంగా కుమారుని వివాహం జరగడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం జార్ఖండ్ సీఎం చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రఘువర్ దాస్ డ్యాన్స్ చేయడం కొత్తేమీ కాదు. నృత్యకళాకారులు, ప్రజలతో జరిగే కార్యక్రమాల్లోనూ ఆయన గతంలో చిందేసి వున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు