రాంచీ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. కంగారూల చేతిలో ఖంగుతింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లను ధరించడంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందారు. ఆ జవాన్ల మృతికి నివాళిగా భారత జట్టు రాంచీ వన్డేలో ఆర్మీ క్యాప్‌లను ధరించింది.
ఇలా టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్ ధరించడంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రికెట్‌ను రాజకీయం చేస్తున్న బీసీసీఐపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ సమాచారశాఖ మంత్రి ఫావద్ చౌదరీ తెలిపారు. కోహ్లీ సేన ఆర్మీ క్యాప్‌లు ధరించిన అంశాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేయాలని మంత్రి ఫావద్ పాక్ క్రికెట్ బోర్డును కోరాడు. ఆర్మీ క్యాప్‌లు ధరించి క్రికెట్ ఆడడం సరికాదని ఫావద్ వెల్లడించారు.