యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీలో తను రెండో స్ధానంలో ఉన్నానని చెప్పారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా.. ఒప్పించి చేయిస్తాం. బాల్ థాక్రే ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యాడా..? ప్రశ్నించారు. తనకు విజన్ ఉంది అని... అందుకే ఆలోచనను పంచుకుంటున్నాను అని చెప్పారు.
జోనల్ వ్యవస్థ విషయంలో మోడీ కాలర్ పట్టుకుని తెచ్చినా అంటున్న కేసీఆర్.. మైనార్టీ రేజర్వేషన్ పైన మోడీ కాలర్ ఎందుకు పట్టుకోవటం లేదు అని ప్రశ్నించారు. సచివాలయం బందులదొడ్డి లెక్క మారిపోయింది. ఇప్పటి సచివాలయంలో ముఖ్యమంత్రిగా చేసిన 16 మంది సీఎంల పిల్లలు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. అల్లుడు మాత్రమే సీఎం అయ్యాడు.