మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైద్య కాలేజీలో ర్యాగింగ్

బుధవారం, 27 జులై 2022 (14:43 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీలో జూనియర్ విద్యార్థులను సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో వేధించారు. కొందరు ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పైగా, నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. 
 
ఈ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కాలేజలో ఈ ఘటన జరిగింది. ర్యాగింగ్ ఘటన తర్వాత జూనియర్లు యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దిండుతో, బ్యాచ్‌మేట్స్‌తో అసహజ శృంగారం చేయాలంటూ జూనియర్లను సీనియర్లు వేధించారు. 
 
ఈ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన యూజీసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ ఘటనపై చర్య తీసుకోవాలని కోరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి జూనియర్ విద్యార్థులు వాంగ్మూలాన్ని తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు