రోబోకు మనిషి చర్మం - 1.5 మిమీ మందంతో...

బుధవారం, 15 జూన్ 2022 (13:37 IST)
శాస్త్రవేత్తలు అచ్చం మనిషిని పోలిన రోబోలను సృష్టించారు. అయితే, వాటికి సిలికాన్ రబ్బరు పొరను జోడించి కొంతవకు సహజ రూపాన్ని తీసుకొస్తున్నారు. రబ్బరుకు మనిషి చర్మం ఆకృతి ఎలా వస్తుందా అనే అంశంపై పరిశోధనలు చేశారు. అలాగని యూనివర్శిటీలో ఆఫ్ టోక్యోలో పరిశోధకులు నిరాశపడలేదు. రోబోల ఉపరితలం మీద మనిషి చర్మాన్ని పుట్టించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. 
 
ప్లాస్టిక్ రోబో వేలుకు మృదులాస్థి, మనిషి చర్మకణాల మిశ్రమంలో ఉంచారు. మూడు రోజుల తర్వాత ఇవి రోబో వేలుకు అంటుకుపోయాయి. మన చర్మం లోపలి పొరలాంటిది ఏర్పడింది. అనంతరం దీనికి కెరటినోసైట్లలోనే చర్మ కణాల్లో పెట్టగా 1.5 మిల్లీమీటర్ల మందంతో చర్మం పైపొర పుట్టుకొచ్చింది. ఇది వేలు ముందుకు, వెనక్కు కదలుతున్నపుడు చెక్కు చెదరలేదు. 
 
పైగా ఎక్కడైనా చీరుకుపోతే మన చర్మం మాదిరిగానే తిరిగి నయం కావడం విశేషం. అయితే, రక్తనాళాలు లేకపోవడంతో వల్ల కొంత సేపటి తర్వాత ఎండిపోతోంది. ఇది తేమగా ఉండటానికి భవిష్యతులో కృత్రిమ రక్తాన్ని సరఫరా చేసే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పైగా అచ్చం మనిషి చర్మం పోలినట్టుగానే మరింత అందంగా కనిపించేలా చెమట గ్రంథులు, వెంట్రుకల కుదుళ్లలోనూ జోడించేందుకు పరిశోధనలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు