భూమిపై నుంచి మనుషులు పంపుతున్న సంకేతాలను ఎలియెన్స్ అర్థం చేసుకోలెకపోతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు 'బీకాన్ ఇన్ ది గెలాక్సీ' అని పేరు పెట్టారు. అయితే, ఇందులో మనుషుల ఫొటోలను పంపించరు. పురుషుడు, స్త్రీ పూర్తిగా నగ్నంగా ఉన్న బొమ్మలను పంపిస్తారు. చేతులను పైకెత్తి.. ఎలియన్స్‌కు 'హాయ్' చెప్పినట్లుగా ఆ బొమ్మలు ఉంటాయి.
'సైబర్‌ఫ్లాషింగ్' చట్టం ప్రకారం స్త్రీ, పురుషుల జననాంగాలు కనిపించే నగ్న చిత్రాలను ఇతరులకు పంపడం నేరం. అయితే, అంతరిక్షానికి ఈ రూల్స్ వర్తించవనే కారణంతో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగానికి నడుం కట్టారు.
గ్రహాంతరవాసులను సంప్రదించేందుకు గత 150 ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు విఫల ప్రయత్నాలు ఎన్నో చేశారు. బోలెడన్ని నిధులను వెచ్చించారు. కానీ, ఇప్పటికీ ఫలితం చిక్కలేదు. ఈ నేపథ్యంలో నాసా శాస్త్రవేత్తలు.. ఎలియెన్స్‌లో కోరికలు రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.