ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం అరుదైనది. మొత్తం చీకటితో 'రింగ్ ఆఫ్ ఫైర్'గా ఈ గ్రహణం కనిపించనుంది. ఏప్రిల్ 20న ఏర్పడే "నింగలూ" అనే సంపూర్ణ గ్రహణం ఆకాశాన్ని క్షణాలపాటు పూర్తిగా చీకటిగా మారుస్తుంది. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పి, రింగ్ ఆఫ్ ఫైర్ ప్రభావాన్ని సృష్టించినప్పుడు ఒక వార్షిక గ్రహణం ఏర్పడుతుంది.
ఆగ్నేయాసియా, ఈస్ట్ ఇండీస్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలోని ఇతర ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది అని నాసా మాజీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడ్ ఎస్పెనాక్ తెలిపారు.