రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్‌లో గూగుల్ సంస్థ రూ. 33,737 కోట్ల పెట్లుబడులు పెట్టనుందని ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఈ పెట్టుబడితో గూగుల్ దాదాపు 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనుందని చెప్పారు. అంటే రిలయన్స్ జియోతో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని తెలిపారు.
ఇప్పటికీ 35కోట్ల మంది 2జీ స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తారని, వారి దృష్టిలో ఉంచుకొని చౌకధరల్లో స్మార్ట్‌ఫోన్ తయారీకి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. జియో, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో తయారీ అయ్యే 4జీ, 5జీ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్.... ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్‌ను ఆప్టిమైజ్ చేసుకోనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.