నిత్యం తన పనిపైనే ధ్యాసపెట్టుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చివరకు జీవితంలో తాను ఏమి కోల్పోయాడో తెలుసుకుని కుమిలిపోతున్నాడు. సంవత్సరానికి రూ.7 కోట్ల వేతన ప్యాకేజీతో ప్రమోషన్ పొందిన ఆనందం కొన్ని క్షణాల్లో ఆవిరైపోయాయి. రూ.7 కోట్ల ప్యాకేజీ తన భార్యను సంతోషపెట్టలేకపోయిందనీ, ఆమె తనపై విరక్తి చెంది విడాకులు అడుగుతోందన్నారు.
ఈ మేరకు ఓ టెక్కీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. మూడేళ్ల క్రితం తాను ఓ కంపెనీలో సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌గా చేరానని, ప్రమోషన్ కోసం రోజుకు 14 గంటల పాటు పని చేశానని, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరం మీటింగులతో బిజీబిజీగా ఉండేవాడినని తెలిపారు.
కౌన్సిలింగ్ కోసం వైద్యుడుని కలిసేందుకు వెళితే తాను తోడుగా వెళ్లలేకపోయినట్టు చెప్పాడు. బంధుమిత్రులను కలవడం, శుభకార్యాలకు హాజరుకాలేకపోయినట్టు చెప్పాడు. ఇవన్నీ త్యాగం చేసి ఉద్యోగానికే అంకితమైనట్టు తెలిపారు. తన కష్టాన్ని గుర్తించి మూడేళ్ల తర్వాత ప్రమోషన్ వచ్చిందన్నారు. రూ.7.8 కోట్ల వార్షిక వేతనం అందుకోబోతున్నట్టు చెప్పారు.
అయితే, భార్య తనతో కలిసి ఉండేందుకు ఇష్టపడంటం లేదని, విడాకులు కోరుతుందని చెప్పారు. ఏ ప్రమోషన్ కోసం అయితే, మూడేళ్లు కష్టపడ్డానో అదే తన వ్యక్తిగత జీవితంలో మంటబెట్టిందని వాపోయాడు. ఈ పోస్టుపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.