ఉస్మానియా ఆస్పత్రిలో హిజ్రా వైద్యులకు కాంట్రాక్ట్ ఉద్యోగం

బుధవారం, 30 నవంబరు 2022 (11:22 IST)
తెలంగాణ రాష్ట్రం ఇద్దరు ట్రాన్స్‌జెండర్ వైద్యుల పట్ల సానుకూలంగా స్పందించింది. ఈ ఇద్దరిని ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకుచెందిన రుత్ జాన్‌పాల్ కొయ్యాల, ప్రాచి రాథోడ్‌లు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 
 
రుత్ జాన్‌పాల్ గత 2018లో ఎంబీబీఎస్ పూర్తి చేయగా, ఆ తర్వాత నగరంలోని వైద్యురిలాగ ప్రాక్టీస్ చేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ, ఆమె చర్యలు ఏవీ ఫలించలేదు. హిజ్రా అనే కారణంగా ఏ ఒక్క ఆస్పత్రి ఆమెకు అవకాశం కల్పించలేదు. 
 
ఈ క్రమంలో గత యేడాది తన స్నేహితురాలైన డాక్టర్ ప్రాచితో కలిసి 'మిత్ర' ట్రాన్స్‌జెండర్ పేరుతో ఓ క్లినిక్ నెలకొల్పారు. ఇపుడు ఈ క్లినిక్‌కు చుట్టుపక్కల వారినుంచి మంచి పేరుంది.
 
అయితే, ఈ ఇద్దరు వైద్యులకు ఉస్మానియా ఆస్పత్రిలో కాంట్రాక్టు వైద్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ అవకాశం రావడంతో వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా విధుల్లో చేరిపోయారు. 
 
కాగా, ప్రాచి రాథోడ్... ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో మూడేళ్లపాటు పని చేశారు. ఆ తర్వాత ఆమె ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని గ్రహించి ఉద్యోగం నుంచి తొలగించారు. ఇపుడు ఆమె ఏకంగా దేశంలోనే గొప్ప పేరున్న ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిగా నియమితులయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు