కానీ కొన్ని జంటలు మాత్రం పెళ్లి అనే బంధానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాయి. ఇందుకు ప్రస్తుతం వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయి. సహజీవనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇష్టపడి వివాహం చేసుకునే జంటలు కలకాలం పచ్చగా వుంటారు. ఇష్టపడి పెళ్లి చేసుకునే వారు ఎలా వుంటారని చెప్పేందుకు ఓ యువతి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో నవవధువు సంతోషంగా కనిపిస్తుంది. స్నేహితులతో సందడి చేస్తుంది. వివాహ వేదికపైనే చేతిలో కొబ్బరిని పెట్టుకుని.. వరుడుని తాకుతూ సైగలు చేస్తూ సంతోషంగా కనిపించింది. ఈ వీడియోను చూసిన వారంతా ఇష్టపడి చేసుకుంటే ఇలా ఉంటారు.. బలవంతంగా చేసుకుంటే మనాలికి హానీమూన్ లేదా ప్లాస్టిక్ డ్రమ్, సిమెంట్‌తో రెడీగా ఉంటారనే పోస్టులు పెడుతున్నారు.