ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తి దేవి దీనిపై స్పందించారు. మరుగుదొడ్లలో వంట చేస్తే తప్పేంటి.. టాయిలెట్ సీటుకు, వంట చేసే స్టవ్‌కు మధ్య గ్యాప్ ఉంటే సరిపోతుందని అన్నారు. ఈరోజుల్లో అందరి ఇళ్లల్లోనూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయని.. అంతమాత్రానా ఇంట్లో భోజనం చేయకుండా ఉంటున్నామా? అని ఎదురు ప్రశ్నించారు.
ఇక అంగన్‌వాడీలో వెలుగుచూసిన ఘటనపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ టాయిలెట్ వినియోగంలో లేకపోవడంతోనే దాన్ని గులకరాళ్లతో నింపేసి కిచిన్‌గా వాడుతున్నారని చెప్పారు. వినియోగంలో లేదు కాబట్టే.. వంట పాత్రలను టాయిలెట్ సీట్‌పై పెట్టారని.. అలా పెట్టినంత మాత్రానా ఏమవుతుందని అన్నారు. ఏదేమైనా దీనిపై విచారణ చేయిస్తామని తెలిపారు.