సీఎం కేసీఆర్ మాటను కూడా ఖాతరు చేయలేదు కదా, మంత్రులు వార్నింగ్ ఇచ్చిన తర్వాత.. కార్మికులు ఇలా చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరో పక్క.. ఆర్టీసీ కార్మికులకు.. ఏపీఎస్ ఆర్టీసీ కూడా మద్దతు వ్యక్తం చేసింది. న్యాయమైన డిమాండ్ల సాధనకు యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడంతో.. టీఎస్ఆర్టీసీ కార్మికులు విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగారని.. ఏపీ ఎంప్లాయిస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ వేర్వురు ప్రకటనల్లో పేర్కొన్నాయి.
మరోవైపు, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం సమీక్ష చేపట్టనున్నారు.