శబరిమలలో భక్తుల సెంటిమెంటే గెలిచింది.. ఎలాగంటే?

శుక్రవారం, 19 అక్టోబరు 2018 (12:46 IST)
కేరళలోని సుప్రసిద్ధ ఆలయం శబరిమలలో.. సెంటిమెంట్ గెలిచింది. పది నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను పోలీసులు పాటించలేకపోయారు. వంద మంది పోలీసులు నిలబడినా.. భారీ స్థాయిలో భక్తులు నిలవడంతో, స్వామి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు మహిళలు వెనుదిరగక తప్పలేదు.
 
అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని హైదరాబాద్ మోజో టీవీ జర్నలిస్టు కవిత, ఎర్నాకులంకు చెందిన రేహ్నా ఫాతిమాలు పోలీసుల సాయంతో ఆలయం వరకూ మాత్రమే చేరుకోగలిగారు. అయితే అక్కడున్న భక్తులు వారిని సముద్రంలా అడ్డుపడ్డారు. దీంతో వారిని పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లిన ఐజీ శ్రీజిత్, వారికి పరిస్థితిని చెప్పి, వెనుదిరగాలని కోరడంతో అందుకు వారు అంగీకరించారు. 
 
ఇదే విషయాన్ని మీడియాకు వివరించిన శ్రీజిత్, మహిళా భక్తులు వెనుదిరిగేలా ఒప్పించామని, పోలీసుల భద్రత నడుమే వారు కొండ దిగుతున్నారని చెప్పారు. దీంతో అయ్యప్ప భక్తుల సెంటిమెంట్ గెలిచిందని నెట్టింట చర్చ సాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు