ఆమధ్య పాకిస్తాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన మిడతల దండు ఇపుడు భారతదేశం పైన పడ్డాయి. ఇపుడీ మిడతల దండు పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో శనివారం సాయంత్రం కనిపించిన ఈ మిడతల గుంపు ఆ ఉజ్జయిన్ జిల్లాలోని రానా హెడ గ్రామంలోనూ, సోమవారం ఉదయానికి రాజస్థాన్ జైపూర్ లో దర్శనమిచ్చాయి.
అక్కడ నిద్ర లేవగానే మేడపైకి వెళ్లినవారికి షాక్ కొట్టేలా దృశ్యం కనిపించింది. ఎటు చూసినా మిడతల దండు కనిపించేసరికి అంతా ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నారు. కాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఈ మిడతల దండు 50,000 హెక్టార్లలో పంటను నాశనం చేశాయి. మరి వీటి నెక్ట్స్ టార్గెట్ ఏ ప్రాంతమో? అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.