ఫోటోగ్రాఫర్ ఎంత పని చేశాడు.. గాయపడిన నిరసనకారుడిని తన్నడం, కొట్టడం..?

శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (13:59 IST)
Photographer
అస్సాం పోలీసులు ఆక్రమణదారులపై కాల్పుల సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ చేసిన పని వివాదానికి దారితీసింది. డారంగ్ జిల్లా ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపైకి వారు కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరిపారు.

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఆందోళనకారుల దాడుల్లో 9 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడ్డ ఒకరిని జర్నలిస్ట్ దాడిచేసినట్టు ఫుటేజీ కనిపించింది. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ ఎవరో కనుక్కొని.. అదుపులోకి తీసుకున్నారు. 
 
ఫోటోగ్రాఫర్ బుల్లెట్ గాయపడిన నిరసనకారుడిని తన్నడం, కొట్టడం ఆ వీడియోలో తెలిసింది. అతనిని విజయ్ శంకర్ బానియాగా పోలీసులు తెలిపారు. అతను ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అని వివరించారు. ఒక డాక్యుమెంట్ కోసం అసోం ప్రభుత్వం అతనికి బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే అతను ఇలా నిరసనకారులతో బిహేవ్ చేయడం విమర్శలకు దారితీసింది.
 
కాగా.. ప్రభుత్వ ఫామింగ్ ప్రాజెక్టు కోసం ఆక్రమణలకు పాల్పడినవారిని అక్కడ నుంచి తరలించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో అందుకు నిరాకరించిన ఆందోళనకారులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపాల్సి వచ్చింది. దీంతో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. అందులో ఒక ఆందోళనకారుతో ఫోటోగ్రాఫర్ అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు