కేంద్రం ఓ చిట్ ఫండ్ కంపెనీనా?

శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:52 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 219-20 సంవత్సర మధ్యంతర బడ్జెట్‌పై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలను కేంద్రం పక్కాగా కాపీ కొట్టిందన్నారు. 
 
తాము ఇప్పటికే అమలు చేస్తున్న వాటిని కేంద్రం ఇవాళ కొత్తగా ప్రకటించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చిట్‌ఫండ్‌ కంపెనీ మాదిరిగా మారిందని ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. 
 
రాష్ట్రాలను సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారు అని ప్రశ్నించారు. రాష్ట్రాలు చేసిన మంచిని కూడా కేంద్రం తమ గొప్పలుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప.. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని నిప్పులు చెరిగారు. ప్రజలను మోసం చేయడానికి బడ్జెట్‌ను బీజేపీ మేనిఫెస్టోలా తయారు చేశారని మమతా బెనర్జీ ఆగ్రహం వెలిబుచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు