కానీ ఇంకా మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. మహిళలపై గృహ హింస, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు కఠినమైన చట్టాలు రావాల్సి వున్నాయి. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలంటే.. తప్పకుండా సౌదీ తరహాలో కఠిన శిక్షలు రావాల్సిందే.
రకరకాలుగా ఉద్యమాలు చేశారు. అంత చేస్తేగానీ.. పురుషులకు తమ తప్పు తెలిసిరాలేదు. ఆ తర్వాత నుంచి పురుషులు, మహిళలకు హక్కుల విషయంలో సమానత్వం చూపించడం మొదలుపెట్టారు. మొదటిసారి ఈ దినోత్సవాన్ని ఓ సెలబ్రేషన్‌లా 1973లో చేశారు.
మహిళలు ఎదిగితే.. తమ చుట్టూ ఉన్నవారు ఎదిగేలా వారు చేస్తారు. అది వారి నైజం. అందుకే భారత్ లాంటి దేశాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. మహిళలకు విలువ ఇవ్వని దేశాలు ఇంకా పేదరికం, ఉగ్రవాదం, అరాచక నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి.