వైద్యుల మాస్కులు కొట్టేస్తున్న వైకాపా నాయకులు: నారా లోకేష్

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:53 IST)
తెదేపా యువ నాయకుడు నారా లోకేష్ మరోసారి ట్విట్టర్ ద్వారా వైకాపా నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన రాతల్లోనే చూడండి. '' వైఎస్ జగన్ గారి బాటలోనే వైకాపా నాయకులు నడుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 420 బుద్దులు వదులుకోలేకపోతున్నారు. విఐపిలమంటూ వైకాపా నాయకులు డాక్టర్లకి ఇచ్చిన మాస్కులు కొట్టేయ్యడం దారుణం.
 
వైకాపా నాయకులు బాగుంటే చాలు. వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రం. కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది.
 
ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు'' అంటూ మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు