పిల్లలపై ప్రమాణం చేసి చెప్తున్నా.. ప్రభాస్‌తో ఆ సంబంధం లేదు: వైఎస్.షర్మిల

సోమవారం, 14 జనవరి 2019 (12:40 IST)
హీరో ప్రభాస్‌తో ఉన్న సంబంధంపై వైకాపా మహిళా నేత వైఎస్.షర్మిల పెదవి విప్పారు. హీరో ప్రభాస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ప్రభాస్‌ను తాను ఎపుడూ కలవలేదనీ, ఆయనతో ఎపుడూ మాట్లాడలేదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నట్టు షర్మిల వెల్లడించారు. ఈ విషయంలో తన నిజాయితీని, నైతికతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 
 
తనపైనా, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్నా జనసేన పార్టీ కార్యకర్తలు, హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ షర్మిల సోమవారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజన్ కుమార్‌కు లిఖిపూర్వక ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తోందన్నారు. పైగా, టీడీపీకి పుకార్లు పుట్టించడం కొత్త కాదన్నారు. ముఖ్యంగా, తన అన్న జగన్ గర్విష్టి, కోపిష్టి అంటూ ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉన్నాయన్నారు. వీటిని దిగజార్చవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 
 
తాము కూడా అలాంటి దుష్ప్రచారం చేయగలమన్నారు. కానీ, తమకు, తమ కుటుంబానికి కొన్ని విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. వాటికి కట్టుబడి ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఇకపోతే, హీరో ప్రభాస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్. షర్మిల స్పష్టం చేశారు. ఆ సమయంలో ఆమె భర్త అనిల్ కుమార్ కూడా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు