మోనార్క్ గ్రూప్ "వర్చువల్ ఆన్ ఎయిర్" విడుదల

బుధవారం, 24 అక్టోబరు 2007 (18:24 IST)
వర్చువల్ స్టూడియో సెట్స్, అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో టెలివిజన్ స్టూడియోలు ఎయిర్ షోలు అందించేందుకు ఉపకరించే పూర్తి స్థాయి బ్రాడ్‌కాస్టింగ్ సొల్యూషన్ 'వర్చువల్ ఆన్ ఎయిర్"ను మెనార్క్ గ్రూప్ బుధవారం విడుదల చేసింది.

ఈ సందర్భంగా మోనార్క్ గ్రూప్ సీఎండీ వీరేన్ సట్రా మీడియాతో మాట్లాడుతూ వార్తలు, గేమ్ షోలు, టాక్ షోలు మరియు పలు రకాల టీవీ కార్యక్రమాల రూపకల్పనకు అవసరమయ్యే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లను వర్చువల్ ఆన్ ఎయిర్ కలిగి ఉందని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆడియో, వీడియో, ఇమేజింగ్ పరిశ్రమకు ఉపయోగపడే అధునాతన సాంకేతిక సౌకర్యాల కల్పనలో మోనార్క్ గ్రూప్ ముందుంటుందని వీరేన్ సట్రా తెలిపారు.

ఇప్పటివరకు టెలివిజన్ నెట్‌వర్క్‌లు, ప్రొడక్షన్ హోసెస్‌కు స్వప్నంగా మిగిలిపోయిన వర్చువల్ సెట్స్‌‌‌కు వాస్తవరూపం కల్పించడంలో తమ ఉత్పత్తి సహకరిస్తుందని వీరేన్ పేర్కొన్నారు. నిజమైన సెట్స్ నిర్మాణానికి అయ్యే వ్యయంలో స్వల్పమొత్తంతో వర్చువల్ సెట్స్ రూపకల్పనకు అవసరమయ్యే సొల్యూషన్ అందించిన తొలి భారతీయ కంపెనీగా మోనార్క్ గ్రూప్ ప్రత్యేక స్థానాన్ని పొందిందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి