పాకిస్థాన్‌కు చెందిన హాస్య నటి, మోడల్ అయిన వీణామాలిక్ ఈ మధ్య పాకిస్థాన్ టెలివిజన్‌లో తన గొప్పలు తానే చెప్పుకుంటుందట. మొదటి నుంచి పాక్ టెలివిజన్ మరియు చిత్ర పరిశ్రమలో తనను తాను ప్రముఖురాలిగా చిత్రీకరించుకోవడానికి పలు ప్రయత్నాలు చేసిన వీణా మాలిక్, ఇంకా ఆ ప్రయత్నాలను ఆపుకోలేదని సమాచారం.
2001లో ఆమె నగ్నచిత్రాలు ఇంటర్‌నెట్‌లో దర్శనమిచ్చాయి. అవి తనవి కాదంటూ ఆమె తర్వాత ఖండించినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది. 2004లో తన సహ నటులతో అసభ్య సీన్లలో నటించారన్న అపప్రధ కూడా ఉంది. 2009లో ఆమె అసిఫ్ మాలిక్‌తో పెళ్ళయిందని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఇద్దరూ ఖండించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో వీణా మాలిక్, పాక్ క్రికెటర్ ఆసిఫ్‌కు ఎస్కార్ట్ సర్వీసులు అందించి, 153000 డాలర్ల మొత్తాన్ని డిమాండ్ చేసి, అందుకతడు నిరాకరించడంతో కోర్టుకెక్కినట్టు కూడా వార్తలు గుప్పుమన్నాయి.
తాజాగా పంజాబ్‌కు చెందిన ‘జెస్ట్ స్పోర్ట్స్’ మ్యాగజైన్‌కు క్రీడా ప్రతినిధి దీక్షిత్‌కు బుకీలతో సంబంధం ఉందంటూ మీడియా ముందుకు వచ్చింది. మరి వీణామాలిక్‌కు ఈ ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..!.