ఆంధ్రప్రదేశ్‌కు ఎయిమ్స్, ఐఐటీ, అగ్రివర్శిటీ, స్మార్ట్ సిటీ, కారిడార్

గురువారం, 10 జులై 2014 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణాపట్నం ఓడరేవు కేంద్రం వద్ద ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతేగాక ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇక హైదరాబాదులో డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాయనున్నట్టు పేర్కొన్నారు.
 
అలాగే, వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ కారిడార్‌లో తొలుత 20 పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఏపీలో ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు. ఎయిమ్స్ కోసం రూ. 500 కోట్ల కేటాయింపు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, విదర్భ, పూర్వాంచల్ రాష్ట్రాలకు ఎయిమ్స్. అంచెలంచలుగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్. ఆంధ్రప్రదేశ్‌కు అగ్రికల్చర్ యూనివర్శిటీ. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్న వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ యూనివర్శిటీ, తెలంగాణకు ఉద్యానవన యూనివర్శిటీలను కేటాయించారు. అలాగే అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి