వ్యవసాయ రంగానికి పెద్దపీట : అరుణ్ జైట్లీ

గురువారం, 10 జులై 2014 (15:59 IST)
దేశ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేపట్టారు. ఇందులోభాగంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సాధారణ బడ్జెట్‌లో కీలక చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 2014-15 సంవత్సరానికిగానూ వ్యవసాయ రుణాలు రూ.8 లక్షల కోట్లు ఇచ్చే విధంగా లక్ష్యం పెట్టుకున్నట్టు మంత్రి ప్రకటించారు. అందులో రూ.5 లక్షల కోట్ల రుణాలు నాబార్డ్ ద్వారా అందిస్తామని తెలిపారు. అంతేగాక రైతులకు తక్కువ వడ్డీకే స్వల్పకాలిక రుణాలు అందిస్తామని చెప్పారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు.
 
ఇకపోతే.. ఈసారి దేశవ్యాప్తంగా ఐదు ఐఐఎంలు, ఐఐటీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మేరకు జమ్ము, ఛత్తీస్‌గఢ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఐదు ఐఐటీలు, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్రలో ఐదు ఐఐఎంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి కోసం రూ.500 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో ఉన్న పలు ఉన్నత శిక్షణ కోర్సులు దేశానికి అవసరమని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి