ఆంధ్రా - తెలంగాణ అభివృద్ధికి కట్టుబడివున్నాం : అరుణ్ జైట్లీ

గురువారం, 10 జులై 2014 (14:29 IST)
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తెలిపారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. 
 
ఆయన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్, హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు, ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలతో పాటు.. ప్రత్యేక నిధుల కేటాయింపు, విశాఖ - చెన్నైల మధ్య పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 
 
అలాగే, తెలంగాణ ప్రాంతానకి ఉద్యానవన విశ్వవిద్యాలయం, హైదరాబాదులో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్‌సభ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం సభ ప్రారంభంకాగానే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆయన తన బడ్జెట్ ప్రసంగాన్ని సుమారు 2.15 గంటల పాటు కొనసాగించారు. 

వెబ్దునియా పై చదవండి