తెలంగాణాకు హ్యాండిచ్చిన అరుణ్ జైట్లీ.. ఏపీపై వరాలు!

గురువారం, 10 జులై 2014 (13:59 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కుపించారు. అదేసమయంలో తెలంగాణకు మాత్రం నిరాశ మిగిల్చారు. కంటితుడుపు చర్యగా కేవలం హార్టికల్చర్ (ఉద్యానవన) యూనివర్సిటీని మాత్రమే ప్రతిపాదించారు. వీటితో పాటు హైదరాబాద్‌లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటును ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.500 కోట్లతో అఖిలభార వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐఐటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్టు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
 
కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యూనివవర్సిటీ ఏర్పాటును ప్రతిపాదించిన ఆయన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే  అనంతపురం జిల్లా హిందూపూర్‌లో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీని ప్రతిపాదించారు. అయితే రెండు రాష్ట్రాలకు ఐఐఎంలు మాత్రం దక్కలేదు. 
 
మరోవైపు.. దూరదర్శన్లో కిసాన్ ఛానెల్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోక్‌సభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. అందుకోసం రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. అలాగే కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందుకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామని అరుణ్ జైట్లీ తెలపారు. 

వెబ్దునియా పై చదవండి