తగ్గనున్న సబ్బులు, టీవీలు, ఫోన్ల ధరలు, బడ్జెట్ హైలెట్స్..

గురువారం, 10 జులై 2014 (13:42 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో మధ్య, సామాన్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై డ్యూటీ తగ్గించారు. దీంతో, సబ్బులు, టీవీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అదేసమయంలో పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, శీతలపానీయాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. కాగా, అరుణ్ జైట్లీ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు... 
 
* ఆర్థిక ద్రవ్య లోటు 4.5 శాతం.
* ప్రణాళికా వ్యయం రూ.17.90 లక్షల కోట్లు.
* ప్రణాళికేత వ్యయం రూ.12.20 లక్షల కోట్లు. 
* రక్షణ రంగానికి రూ.2.29 కోట్లు.
* సరిహద్దుల భద్రతకు రూ.2250 కోట్లు. 
* సాయుధ దళాల ఆధునికీకరణకు రూ.5 వేల కోట్లు.
* కాశ్మీర్ శరణార్థులకు రూ.500 కోట్లు.
* రూ.100 కోట్లతో అమరజవాన్ల స్మృతి చిహ్నం. 
* పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ.100 కోట్లు. 
* గృహ రుణాల వడ్డీ పరిమితి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంపు. 
* ఐటీ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంపు. 
* సీనియర్ సిటిజన్ల పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు పెంపు. 
* మణిపూర్‌లో రూ.100 కోట్లతో క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణం. 
* బెంగళూరు, ఫరీదాబాద్‌లో బయోటెక్ క్లస్టర్ల అభివృద్ధి. 
* సెప్టెంబర్‌లో మార్స్ ఆర్బిట్ ప్రయాగం. 
* అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ. 
* ఈశాన్య రాష్ట్రాల కోసం 'అరుణ ప్రభ' పేరుతో టీవీ ఛానెల్. 
* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.53,706 కోట్లు. 
* ఈశాన్య రాష్ట్రాల్లో రైలు మార్గాల విస్తరణకు రూ.500 కోట్లు.
* ఉత్తరాఖండ్‌లో నేషనల్ సెంటర్ ఫర్ హిమాలయన్ స్టడీస్. 
* కాశ్మీర్ శరణార్థుల సంక్షేమానికి రూ.500 కోట్లు. 
* సున్నపు రాయి, డోలమైట్‌పై పన్ను రాయితీ. 
* స్మార్ట్ కార్డులపై 12 శాతం ఎక్సైజ్ డ్యూటీ. 
* 19 అంగుళాల టీవీల స్వదేశీ తయారీ కంపెనీలకు పన్ను రాయితీ. 
* విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదేళ్లపిటు పన్ను మినహాయింపు. 
* పారిశ్రామిక కారిడార్లకు సమాంతరంగా ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం. 
* బాక్సైట్ ఎగుమతి సుంకం 10 నుంచి 20 శాతానికి పెంపు. 
* కాకినాడలో హార్డ్ వేర్ ఉత్పత్తి కేంద్రం. 
* నగరాల్లో మహిళల భద్రతకు రూ.150 కోట్లు. 
* కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఉత్పత్తులపై పన్ను రాయితీ. 
* పీపీఎఫ్ పరిమితి రూ. లక్ష నుంచి రూ. లక్షన్నరకు పెంపు. 
* ఐటీ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంపు.
* ముంబై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ సకాలంలో పూర్తి. 
* జమ్మూ కాశ్మీర్ హస్తకళల ప్రోత్సాహానికి రూ.50 కోట్లు. 
* బెనారస్ సిల్స్ అభివృద్ధికి రూ.50 కోట్లు. 
* జాతీయ రహదారుల విస్తరణకు రూ.37857 కోట్లు. 
* కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటి.
* రూ.11600 కోట్లతో నౌకాశ్రయాల అనుసంధానం
* గ్యాస్ గ్రిడ్ పూర్తి చేసేందుకు (పీపీపీ విధానంలో) 15 వేల కి.మీ. అదనపు పైప్ లైన్ నిర్మాణం. 
* ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో విమానాశ్రయాల అభివృద్ధి. 
* తమిళనాడు, రాజస్థాన్‌లో సోలార్ విద్యుత్ కు రూ.500 కోట్లు. 
* నదుల అనుసంధానంపై అధ్యయనానికి రూ.100 కోట్లు. 
* నమో గంగా పథకానికి రూ.2037 కోట్లు. 
* మెరైన్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.115 కోట్లు. 
* బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంపు.
* రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పెంపు. 
* దేశంలో 100 స్మార్ట్ సిటీలను నెలకొల్పుతాం. వీటి కోసం రూ. 060 కోట్లు వెచ్చిస్తాం. 
* దేశంలోని 9 విమానాశ్రయాల్లో వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అమలుచేస్తాం.
* నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.
* వ్యవసాయాభివృద్ధికి 'పీఎం కృషి సచార్' పథకానికి రూ. 1000 కోట్లు.
* వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పథకం. 
* 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.వెయ్యి పెన్షన్ 
* ఆహార, చమురు సబ్సిడీలపై దృష్టి సారిస్తాం. 
* ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ.50,548 కోట్లు.
* గ్రామాణ విద్యుదీకరణకు రూ.500 కోట్లు.
* గ్రామీణ తాగునీటికి రూ. 3,600 కోట్లు. 
* బాలికల సాధికారతకు రూ.100 కోట్లు.
* ఆడపిల్లలను విద్య, రక్షణ కోసం రూ.500 కోట్లు. 
* మహిళల భద్రతకు రూ.150 కోట్లతో పైలట్ ప్రాజెక్టు. 
* అంధుల కోసం బ్రెయిలీ లిపిలో కరెన్సీ నోట్లు. 
* ఏపీలో ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు. ఎయిమ్స్ కోసం రూ.500 కోట్ల కేటాయింపు. 
* ఆంధ్రప్రదేశ్, బెంగాల్, విదర్భ, పూర్వాంచల్ రాష్ట్రాలకు ఎయిమ్స్. 
* ఆంధ్రప్రదేశ్‌కు అగ్రికల్చర్ యూనివర్శిటీ. తెలంగాణకు హార్టికల్చర్ యూనివర్శిటీ.
* ఏపీ, జమ్మూ, చత్తీస్‌గఢ్, గోవా, కేరళ రాష్ట్రాలకు ఐఐటీలు. దేశంలో 4 ఐఐఎంలు. 
* కొత్తగా 12 దంత, వైద్య కాలేజీలు 
* ప్రధాని గ్రామ్ సడక్ యోజనకు రూ.14,389 కోట్లు.
* గ్రామీణ గృహ నిర్మాణానికి రూ.8000 కోట్లు. 
* నైపుణ్యాల పెంపునకు స్కిల్ ఇండియా కార్యక్రమం. 
* 2022 నాటికి అందరికీ నివాసం. 
* దళిత, గిరిజన, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు. 
* ఏకీకృత ప్రావిడెంట్ ఫండ్ విధానం కోసం ఈపీఎఫ్‌వో ప్రారంభం. 
* సర్వశిక్షా అభయాన్‌కు రూ.28,635 కోట్లు. 
* మదర్సాల అభివృద్ధికి రూ.100 కోట్లు. 
* వాటర్ షెడ్ పథకానికి రూ.2142 కోట్లు.
* గ్రమాణ రహదారుల నిర్మాణానికి రూ.14,389 కోట్లు. 
* నగరాల్లో మెట్రో పనులకు రూ.100 కోట్లు. 
* కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అభివృద్ధికి రూ.100 కోట్లు. 
* ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు రూ.500 కోట్లు. 
* మహిళలకు పావలా వడ్డీ పథకం 250 జిల్లాలకు పెంపు 
* పట్టణాల్లో రైతు మార్కెట్లు. 
* రైతుల కోసం కిసాన్ టెలివిజన్ కు రూ.100 కోట్లు. 
* వ్యవసాయ రంగంలో గోదాముల నిర్మాణానికి రూ.5000 వేల కోట్లు. 
* వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు. 
* రైతులకు 3 శాతం వడ్డీతో పంట రుణాలు. 
* నాబార్డు ద్వారా 5 లక్షల మంది భూమి లేని రైతులకు ఆర్థిక సాయం. 
* దేశవ్యాప్తంగా 100 మొబైల్ భూసార పరీక్షా కేంద్రాలు. 
* భూసార పరీక్షా కేంద్రాలకు రూ.56 కోట్లు. 
* రైతుల భూ నాణ్యత కార్డులకు రూ.100 కోట్లు.
* సకాలంలో వడ్డీ చెల్లించిన రైతులకు రాయితీ కొనసాగింపు. 
* పథకాల్లో తాగునీటి పథకానికి రూ.28635 కోట్లు.
* నేషనల్ హౌసింగ్ బ్యాంత్ 
* వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ కారిడార్‌లో తొలుత 20 పరిశ్రమలు. 
* ఆర్థిక వ్యవస్థ పటిష్ఠానికి కాకినాడ పోర్టు కీలకం. 
* స్టార్టప్ కంపెనీల కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి. 
* ఈ ఏడాది 16 కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి. 
* 6 టెక్స్ టైల్ పార్క్‌ల ఏర్పాటు కోసం రూ.200 కోట్లు. 

వెబ్దునియా పై చదవండి