బడ్జెట్ బావుంది... అబ్బే అదో ఎండమావి...

గురువారం, 10 జులై 2014 (17:56 IST)
వాస్తవికతకు దర్పణం....
దేశం పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, ఒకవైపు ద్రవ్యోల్బణం పరిస్థితి దారుణంగా ఉంటే మరోవైపు బ్లాక్ మనీ దేశాన్ని కుదిపేస్తోందని, ఈ పరిస్థితులలో ఎంతో జాగ్రత్తగా దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. తాజాగా అరుణ్ జెట్లీ  ప్రవేశ పెట్టిన బడ్జెట్ దీనిని ప్రతిబింబించింది. భవిష్యత్‌లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది
- టి. హనుమాన్ చౌదరి, టెలికం రంగ నిపుణలు
 
జెట్లీ బడ్జెట్ ఓ ఎండమావి...
ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి సాధారణ బడ్జెట్ ఎండమావే అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ధరల నియంత్రణపై ఏమాత్రం దృష్టి పెట్టని జైట్లీ.. కార్పొరేట్ కంపెనీల కోసమే ప్రభుత్వం ఉందన్న రీతిలో వ్యవహరించారని విమర్శించారు. 
- రాపోలు ఆనంద్ భాస్కర్ ఎం.పి రాజ్యసభ, కాంగ్రెస్
 
బడ్జెట్ బాగానే ఉంది కానీ...
అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసింది. రైతులకు, చేనేత కార్మికులకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని కానీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే విషయాన్ని బడ్జెట్‌లో పెట్టి ఉంటే బాగుండేదని బుట్టా రేణుక అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేసిన రేణుక రాష్ట్ర రెవెన్యూ లోటు గురించి సభలో జెట్లీ ప్రకటించకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో మాట్లాడతామని ఆమె అన్నారు.
- బుట్టా రేణుక ఎం.పి వైఎస్ ఆర్ పార్టీ

వెబ్దునియా పై చదవండి