అరుణ్ జైట్లీ బడ్జెట్‌పై రాహుల్ గాంధీ కామెంట్స్!

గురువారం, 10 జులై 2014 (17:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ వల్ల ఇక దేశంలో ఆర్థిక మందగమనం తప్పదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని తగ్గించేలా ఉండటంతో దేశం ఆర్థిక మందగమన దిశగా పయనించే ప్రమాదం ఉందని విమర్శించారు. 
 
అసలు ఈ బడ్జెట్‌కు ఎలాంటి రోడ్ మ్యాప్ లేనేలేదని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్టీ ఎంపీలతో కలిసి అధికార పక్షంపైకి దూకేందుకు సిద్ధమైన యువరాజు ఆనక తల్లి దగ్గరే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గురువారం నాటి బడ్జెట్‌పై మాత్రం కాస్త తెలివిగానే స్పందించించారు. 
 
కానీ బుధవారం మాత్రం లోక్‌సభలో ధరల పెరుగుదలపై సుదీర్ఘ చర్చ జరుగుతుంటే రాహుల్ గాంధీ మాత్రం హాయిగా కునుకు తీసిన విషయం తెల్సిందే. చివరి బెంచీలో కూర్చొనే ఆయన గురువారం మాత్రం కాస్తంత ముందుకు జరిగి కూర్చొన్నారు. 

వెబ్దునియా పై చదవండి