అరుణ్ జైట్లీ బడ్జెట్ సూబర్బ్.. లార్డ్ స్వరాజ్ పాల్

గురువారం, 10 జులై 2014 (16:08 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2014-15 వార్షిక బడ్జెట్‌ విదేశీ ట్టుబడుదారులను ఆకర్షించే విధంగా ఉందని ప్రముఖ ప్రవాస పారిశ్రామికవేత్త, కెపరో గ్రూప్ ఛైర్మన్ లార్డ్ స్వరాజ్ పాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత బడ్జెట్ విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన సంకేతాలనిచ్చిందన్నారు. 
 
దేశం ఆర్థికంగా కోలుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి అరుణ్ జైట్లీలు ఈ బడ్జెట్ ద్వారా చక్కటి రోడ్ మ్యాప్ వేశారని ప్రశంసించారు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిదిగా ఈ బడ్జెట్ ఉందన్నారు. కెపరో గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ అయిన స్వరాజ్ పాల్, భారతదేశంలోని స్టీల్, ఆటో మోటివ్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టారు. 

వెబ్దునియా పై చదవండి