చెన్నై టు వైజాగ్ ... పారిశ్రామిక కారిడార్ : అరుణ్ జైట్లీ

గురువారం, 10 జులై 2014 (13:16 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి సాగరతీరం విశాఖపట్నం వరకు పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆర్థిక మంత్రి ప్రకటనతో ఈ కారిడార్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలించినట్టేనని చెప్పొచ్చు. 
 
అలాగే, అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ.50,548 కోట్లు. గ్రామాణ విద్యుదీకరణకు రూ.500 కోట్లు. గ్రామీణ తాగునీటికి రూ.3,600 కోట్లు. బాలికల సాధికారతకు రూ.100 కోట్లు. ఆడపిల్లలను చదివించండి, రక్షించండి పథకానికి రూ.500 కోట్లు. మహిళల భద్రతకు రూ.150 కోట్లతో పైలట్ ప్రాజెక్టు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. 
 
అదేవిధంగా ఏపీలో ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు. ఎయిమ్స్ కోసం రూ. 500 కోట్ల కేటాయింపు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, విదర్భ, పూర్వాంచల్ రాష్ట్రాలకు ఎయిమ్స్. అంచెలంచలుగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్. ఆంధ్రప్రదేశ్‌కు అగ్రికల్చర్ యూనివర్శిటీ. తెలంగాణకు హార్టికల్చర్ యూనివర్శిటీలను కేటాయించారు. 
 

వెబ్దునియా పై చదవండి