అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ 2014 -15 : హైలెట్స్... ఐటీ పరిమితి పెంపు..

గురువారం, 10 జులై 2014 (12:20 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టారు. నరేంద్ర మోడీ సర్కారుకు ఇదే తొలి బడ్జెట్. జైట్లీ బడ్జెట్లోని ప్రధానాంశాలు ఇవే...

వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు దారులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వల్ప ఊరట కలిగించారు. ప్రస్తుతమున్న ఆదాయ పన్ను పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచారు. అలాగే, సీనియర్ సిటిజన్లకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ఇతర వర్గాలక వారికి ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. 80 సీసీ పన్ను పరిమితిని రూ.1.50 లక్షలకు పెంచారు. పీపీఎఫ్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంచారు. 
 
* 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ పథకం తీసుకువస్తాం. నెలకు రూ.1000 పెన్షన్. ఈ పథకం కోసం రూ.250 కోట్ల కేటాయింపు.
* వ్యవసాయాభివృద్ధికి 'పీఎం కృషి సచార్' పథకానికి రూ.1000 కోట్లు.
* ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు రూ. 500 కోట్లు. 
* నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.
* వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పథకం. 
* మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి రూ. 2.4 లక్షల కోట్లు. 
* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు. 
* ఆహార,చమురు సబ్సిడీలపై దృష్టి సారిస్తాం. 
* ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ.50,548 కోట్లు.
* గ్రామీణ విద్యుదీకరణకు రూ.500 కోట్లు.
* గ్రామీణ తాగునీటికి రూ.3,600 కోట్లు. 
* బాలికల సాధికారతకు రూ.100 కోట్లు.
* 'ఆడపిల్లలను చదివించండి, రక్షించండి' పథకానికి రూ.500 కోట్లు. 
* మహిళల భద్రతకు రూ.150 కోట్లతో పైలట్ ప్రాజెక్టు. 
* అంధుల కోసం బ్రెయిలీ లిపిలో కరెన్సీ నోట్లు. 
* ఏపీలో ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు. ఎయిమ్స్ కోసం రూ.500 కోట్ల కేటాయింపు. 
* ఆంధ్రప్రదేశ్, బెంగాల్, విదర్భ, పూర్వాంచల్ రాష్ట్రాలకు ఎయిమ్స్. 
* అంచెలంచలుగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు  
* ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ, తెలంగాణకు ఉద్యానవన విశ్వవిద్యాలయాలు. 
* నైపుణ్యాల పెంపునకు స్కిల్ ఇండియా కార్యక్రమం. 
* 2022 నాటికి అందరికీ నివాసం. 
* భారత ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. 
* ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, అధిక వృద్ధి రేటును పెంచడమే లక్ష్యం
* రానున్న 3-4 ఏళ్లలో 7 నుంచి 8 శాతం వృద్ధి రేటును సాధిస్తాం. 
* పేదరికాన్ని నిర్మూలిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తాం. 
* ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా... పరిస్థితిని సమూలంగా చక్కదిద్దుతాం. 
* ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు. 
* నల్లధనం సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
* భవిష్యత్ తరాలకు అప్పును వారసత్వంగా ఇవ్వలేం. 
* పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తాం. 
* బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంపు.
* రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పెంపు. 
* పట్టణ నిర్మాణ రంగంలో ఎఫ్ డీఐలను అనుమతిస్తాం. 
* కొత్త యూరియా విధానాన్ని ప్రవేశపెడతాం.
* పన్ను చెల్లింపుదారుల సమస్యల సరిష్కారం కోసం కమిషన్ ను నెలకొల్పుతాం.
* దేశంలో 100 స్మార్ట్ సిటీలను నెలకొల్పుతాం. వీటి కోసం రూ. 7060 కోట్లు వెచ్చిస్తాం. 
* దేశంలోని 9 విమానాశ్రయాల్లో వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అమలుచేస్తాం.
* గుజరాత్ లో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రూ.200 కోట్లు 
* బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం. 
* కరెంటు ఖాతా లోటుపై నిరంతర నిఘా ఉంచుతాం. 
* దళిత, గిరిజన, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు. 
* ఏకీకృత ప్రావిడెంట్ ఫండ్ విధానం కోసం ఈపీఎఫ్ వో ప్రారంభం. 
* సర్వశిక్షా అభయాన్ కు రూ. 28,635 కోట్లు. 
* మదర్సాల అభివృద్ధికి రూ. 100 కోట్లు. 
* వాటర్ షెడ్ పథకానికి రూ. 2142 కోట్లు.
* గుజరాత్ తరహా పట్టణికీకరణకు చర్యలు. 
* ఆరు రాష్ట్రాలకు ఐఐటీలు. 
* కొత్తగా 12 మెడికల్ కాలేజీలు (వైద్య,దంత). 
* ప్రధాని గ్రామ్ సడక్ యోజనకు రూ. 14,389 కోట్లు.
* 2019 నాటికి పరిశుభ్ర భారత్. 
* గ్రామీణ గృహ నిర్మాణానికి రూ. 8000 కోట్లు. 
* గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ. 14,389 కోట్లు. 
* నగరాల్లో మెట్రో పనులకు రూ. 100 కోట్లు. 
* కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అభివృద్ధికి రూ. 100 కోట్లు.

వెబ్దునియా పై చదవండి