అరుణ్ జైట్లీ ఆదాయ పన్ను పరిమితి ఫర్వాలేదు!

గురువారం, 10 జులై 2014 (14:37 IST)
కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని ఇప్పుడున్న 2 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయలకు పెంచారు. అదే సీనియర్ సిటిజన్ల విషయంలో అయితే ఈ పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. ఉద్యోగులకు కూడా మూడు లక్షల రూపాయల ఆదాయపు పన్ను పరిమితిని ఇస్తారని ఉద్యోగులు ఆశించారు. అయితే అనుకున్న లక్ష్యం కంటే రూ.50 వేలు తక్కువగా ప్రకటించినందుకు ఉద్యోగులు కొంత నిరాశ చెందినా, ఫర్వాలేదనే భావన ఏర్పడింది. 
 
అలాగే ఆదాయ పన్ను మినహాయింపు వచ్చే పొదుపు మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి లక్షన్నరకు పెంచుతూ ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇది కొంతవరకు ఊరట కల్పించే అంశమే అవుతుంది. గృహరుణాల వడ్డీ మీద పన్ను మినహాయింపును కూడా 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచారు. దీనివల్ల గృహరుణాలు తీసుకుని, 80సిలో కూడా పొదుపును పాటించే ఉద్యోగులకు సుమారు రూ.1.50 వరకు ఊరట లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి