నదుల అనుసంధానంపై అధ్యయనం కోసం రూ.100 కోట్లు

గురువారం, 10 జులై 2014 (17:40 IST)
దేశంలోని నదులను అనుసంధానం చేసే అంశంపై అధ్యయనం జరిపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంద కోట్ల రూపాలను కేటాయించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2014-15 వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా ఐదు ఐఐటీలు, ఐదు ఐఐఎంలతో పాటు.. 12 కొత్త వైద్య, దంత కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎయిమ్స్ ఆస్పత్రిని నెలకొల్పనున్నట్టు ప్రకటించిన అరుణ్ జైట్లీ ఇందుకోసం రూ.500 కోట్లను కేటాయించారు. 
 
జమ్ము, ఛత్తీస్‌గఢ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఐదు ఐఐటీలు, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్రలో ఐదు ఐఐఎంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి