ఇకపోతే, రెడ్ కలర్ బ్యాగులో ట్యాబెలట్‌ను పార్లమెంట్‌కు తీసుకువెళ్లారు. ఆ బ్యాగుపై గోల్డ్ కలర్‌తో జాతీయ చిహ్నం ఉంది. ఎరుపు, క్రీమ్ కలర్ చీరలో సీతారామన్.. పార్లమెంట్‌కు వెళ్లడానికి ముందు రాష్ట్రపతి భవన్ వెళ్లారు. 2019లోనూ మోడీ సర్కార్ బడ్జెట్ వేళ కొత్త సాంప్రదాయాన్ని ఆరంభించారు.
లెదర్ బ్రీఫ్ కేసులో తీసుకువెళ్లే బడ్జెట్ పత్రాలను.. ఆ ఏడాది ఆమె తొలిసారి బహీఖాతా పుస్తకం రూపంలో తీసుకువెళ్లారు. మోడీ ప్రభుత్వం సూట్‌కేసు మోసుకేళ్లే టైపు కాదంటూ మంత్రి సీతారామన్ అన్నారు. ఎంపీలందరికీ బడ్జెట్ కాపీలు చదువుకునేందుకు.. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను మంత్రి సీతారామన్ ఆవిష్కరించారు. చాలా సులువైన రీతిలో డిజిటల్ విధానాన్ని రూపొందించారు.
కాగా, మంత్రి సీతారామన్ ఇవాళ 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెడుతారని, డిజిటల్ రూపంలో ఆ బడ్జెట్ ఉంటుందని, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను indiabudget.gov.in పోర్టల్ లేదా యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ట్వీట్ చేశారు.