దేశంలోని మహిళల జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో మహిళా అభ్యున్నతి కోసం కొత్తగా మూడు పథకాలను ఆమె ప్రకటించారు. ఇందులోభాగంగా, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలతో పాటు పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. అలాగే, మహిళల సాధికారితకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
ప్రధానంగా మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే మూడు పథకాలు ప్రారంభించినట్టు చెప్పారు. మిషన్ పోషన్, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలను కొత్తగా ప్రారంభించినట్టు చెప్రపారు. మహిళల ప్రగతి కోసం తమ ప్రభుత్వం ఈ పథకాలను తెచ్చిందని తెలిపారు. ఈ పథకాల ద్వారా మహిళ మేథో, సామాజిక ఆర్థిక వృద్ధి మెరుగుపుడుతుందని ఆమె చెప్పుకొచ్చారు.
మిషన్ శక్తి పథకాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పని చేస్తుందని నిర్మలా సీతారమన్ వెల్లడించారు. మహిళా శక్తికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ మహిళల సాధికారికత కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. దాంతో ఎంతోమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని అన్నారు. మిషన్ శక్తి విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.