బడ్జెట్ 2022: రూ. 10 లక్షల ఆదాయపు స్లాబ్‌కి పైన వున్నవారికే వడ్డింపు?!!

శుక్రవారం, 28 జనవరి 2022 (15:58 IST)
ఫిబ్రవరి 1, 2022న ఉదయం 11 గంటలకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022ని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
 
 
ఇదిలావుంటే ఆదాయపు పన్ను స్లాబ్, 2022 బడ్జెట్‌లో అంచనా వేసిన రేట్ల మార్పులు గురించి చర్చ మొదలైంది. యూనియన్ బడ్జెట్ 2022 నుండి పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను విషయంలో చాలా ఉపశమనం పొందవచ్చని భావిస్తున్నారు.

 
రూ. 2.5 లక్షల ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిలో మెరుగుదలని ఆశిస్తున్నారు. అంటే.... అది కనీసం రూ. 3 లక్షలుగా వుండాలని ఆశిస్తున్నారు. అలాగే 10 లక్షలు ఆదాయానికి పైన వున్నవారికే పన్ను సవరణలు చేయాలని, దిగువన వున్నవారికి సమంజసమైన ట్యాక్స్ రేట్ విధించాలని కోరుతున్నారు. మరి బడ్జెట్టులో కేంద్రమంత్రి నిర్మల ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తారో చూడాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి