మనోభావాలకు అద్దాలు... అందమైన పుష్పాలు

WD

FileFILE
ప్రియుడు లేదా ప్రియురాలికి అందించే పువ్వులు అన్యాపదేశంగా ప్రేమికుల మనస్సులోని భావాలను బహిర్గతం చేస్తాయి. ఈ నేపథ్యంలో పుష్పాలు పలికే భావాలను మీకు అందించే చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాం... తనకు నచ్చిన యువకుని ప్రోత్సహించే క్రమంలో బుర్చ్ పత్రాలను యువతి అందిస్తుంది. పెయూనియా పుష్పాలు "నేను ఆగ్రహంతో ఉన్నాను" అనే సంకేతాన్ని సూచిస్తాయి. కాలూ లిల్లీ పువ్వు సౌందర్యానికి సంకేతం. విరబోసిన గులాబీ పువ్వు స్థిరమైన ప్రేమకు నిదర్శనం.

శ్వేత వర్ణపు కార్నేషన్ పుష్పం స్వచ్ఛమైన ప్రేమకు సంకేతంగా, మంచి జరిగాలని కోరుకుంటూ ప్రియతములకు అందించేందుకు ఉపకరిస్తుంది. నీరుకావి రంగు గులాబీ పువ్వు "నన్ను విశ్వసించమని" కోరుతుంది. క్రుషాంతుముమ్ పుష్పం సంతోషాన్ని, ఆశావాదాన్ని ప్రదర్శిస్తుంది. ఎరుపు రంగు గులాబీ ప్రేమ, కోరికలకు గుర్తుగా నిలుస్తోంది. "నేను నీతో ఉన్నంతకాలం సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడ"ని డఫుడిల్ చెప్తుంది.

అపనమ్మకం, అసూయ మరియు స్నేహానికి పసుపు రంగు గులాబీ పుష్పం నిదర్శనంగా నిలుస్తోంది. తెలుపు, ఎరుపు వర్ణాల రోజాపుష్పాలును కలిపి ఇస్తే ఐక్యత, హృదయపూర్వక అభిమానాన్ని సూచిస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది. "నిన్ను రహస్యంగా ప్రేమిస్తున్నానంటూ" ప్రియునికి సందేశమిచ్చేందుకు గార్డెనా ఉపకరిస్తుంది.

రోజ్‌మేరీ పుష్పం విశ్వాసంతో కూడిన ప్రేమకు సంకేతం. ప్రేమ నిర్థారణకు, నిజమైన ప్రేమికుడు/ప్రేమికురాలికి నిదర్శనంగా టూలిప్ పుష్పం నిలుస్తుంది. "నీ నేత్రాలు అందంగా ఉన్నాయంటూ" రంగులు కలగలసిన టూలిప్ పుష్పం చెప్తుంది. "నన్ను విశ్వసించమని" ఎరుపు రంగు టూలిప్ కోరుతుంది.

వెబ్దునియా పై చదవండి