జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

ఠాగూర్

మంగళవారం, 21 మే 2024 (17:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, అధికార వైకాపా చిత్తుగా ఓడిపోతుందని ఆయన మరోమారు చెప్పారు. జూన్ నాలుగో తేదీన ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి దిగ్భ్రాంతి కలిగించేలా ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇపుడు కూడా మరోమారు ఇదే మాట చెబుతున్నట్టు తెలిపారు. జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిపోతుందన్నారు. 
 
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయిందని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిక్సర్ కొట్టబోతున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో ఒక వ్యూహకర్తగా పదేళ్ల అనుభవం ఉందని, ఆ అనుభవంతో చెబుతున్నా ఏపీలో వైకాపా చిత్తుగా ఓడిపోబోతుంది అని ఆయన మరోమారు పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడిపోతారనేది తాను అంచనా వేయగలనని చెప్పారు. జగన్ పార్టీ విషయంలోనూ తన అంచనాలు తప్పవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు